
కందములు:
ఘన కాకతీయ కాల
మ్మునఁ దిరమగు నోరుఁగంటి పురిఁ బాల్కుఱికిన్
జననమ్ము నంది తా వెలిఁ
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!
వారని శివ భక్తియు దై
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వీరమహేశ్వర వ్రతుఁడై
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!
తెలుఁగుం గన్నడ సంస్కృత
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
బులకించె జనుల హృదులునుఁ
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!
శివకవి యుగమ్ము నందునఁ
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
బ్రవిమల కాంతులఁ జిమ్మఁగ
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!
కమనీయ వీర శైవయు
తము బసవపురాణ పండితారాధ్యచరి
తము బసవపురాణ పండితారాధ్యచరి
త్రముల విరచించి జనులకు
నమల ద్విపదాఖ్య పద్యహారముల నిడెన్!
అనుభవసారము నెల్లను
ననుభవసార మను పేర నతుల సుకావ్య
ననుభవసార మను పేర నతుల సుకావ్య
మ్మును రచియించియుఁ బ్రజ కిడి
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!
పలుకావ్యాల్ విరచించియుఁ
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
విలువైన రీతిఁ బ్రసరణ
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!
శివభక్తుల కథ లెల్ల న
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
శివ మహిమలఁ జూపించెను
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!
శ్రీ వీరశైవ భూసుర
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
యా వీరశైవ ఘనుఁడే
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!
ఆ మహనీయుని కెనయగు
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
సామాన్యుఁడు కాఁ డాతం
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్!
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్!
స్వస్తి
మిత్రులారా! ఈ పోస్టుపై మీ అభిప్రాయములు తెలుపగలరు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచాలా బాగున్నది.
వీరి కావ్యములిప్పుడేవేవి లభ్యము తెలుపగలరు
జిలేబి
ధన్యవాదాలండీ జిలేబీ గారూ! గతంలో అచ్చయిన కావ్యా లిప్పుడు దొరకడం లేదు. ఈ మధ్యనే తెలుగు విశ్వ విద్యాలయం వారు కొన్ని పుస్తకాలు అచ్చువేశారని మా గురువులు శ్రీ అనుమాండ్ల భూమయ్య గారు చెప్పగా విన్నాను. హైదరాబాదులో తెలుగు విశ్వవిద్యాలయ పుస్తకాలయంలో వాకబుచేస్తే దొరకవచ్చు! ప్రయత్నించండి!
తొలగించండి
రిప్లయితొలగించండిపాల్కురికి వారి గ్రంథములు
https://archive.org/details/ఫల్కురికి
జిలేబి
తొలగించండిhttps://archive.org/details/Palkuriki
జిలేబి
పుస్తకాలు దొరికే లింకు ఇచ్చి పుణ్యం కట్టుకున్నందులకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండీ జిలేబీ గారూ!
తొలగించండి